గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్(జుక్కల్): గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శనివారం జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని సర్పంచులు ఎమ్మెల్యేను కలిసి ఘనంగా సన్మానించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సర్పంచులు ప్రజా సేవ చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు.కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్‌రెడ్డి, సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మద్దెలచెరువు అభివృద్ధికి కృషి చేస్తా
పిట్లం(జుక్కల్): మద్దెల చెరువు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఆయన శనివారం మండలంలోని మద్దెల చెరువు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కళావతిని సర్పంచ్ గెలిపించినందుకు గ్రామస్తులకు ధ్యనవాదాలు తెలిపారు. గ్రామంలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్ కళావతిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో ...
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వం అధికారికంగా శనివారం బిచ్కుందలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు శైలేష్, అమృత్‌రాజ్, ఆనంద్‌రాజ్, నాయకులు విఠల్‌రెడ్డి, నాగ్‌నాథ్, అసద్‌అలీ, సాయగౌడ్, నాగ్‌నాథ్ పటేల్, దర్పల్ గంగాధర్, బిచ్కుంద, మద్నూర్ ఏఎంసీ చైర్మన్లు, తహసీల్దార్ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ ఖయ్యుం, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


