ప్రజలతో మమేకమవ్వాలి
● ఎల్లారెడ్డి మాజీఎమ్మెల్యే జాజాల సురేందర్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలో బీఆర్‌ఎస్ తరుఫున పోటీచేసి గెలుపొందిన సర్పంచ్‌లు, ఉనసర్పంచ్‌లు, వార్డుసభ్యులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై మంచిపేరు తెచ్చుకోవాలని ఎల్లారెడ్డి మాజీఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచించారు. మండలకేంద్రంలో శనివారం వారిని ఆయన సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సిద్ధయ్య, ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీచైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మనోహార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు అంకిత భావంతో పనిచేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని జీఎన్‌ఆర్ గార్డెన్‌లో బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మానం కార్యక్రమం జరిగింది. ఈసభలో సురేందర్ మాట్లాడారు. గెలుపొందిన ప్రజాప్రతినిధులు అంకిత భావంతో పని చేసి ప్రజల్లో విశ్వాసం పొందాలన్నారు. ఓడిన వారు కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నాయకులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దివిటి రమేశ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, విష్ణువర్ధన్‌రెడ్డి, లింగంపేట పట్టణ అధ్యక్షుడు అశోక్, భవానిపేట సర్పంచ్ సురేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


