హుండీ ఆదాయం లెక్కింపు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) కాలభైరవుడి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. రూ.2,72,355 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. హుండీ లెక్కింపును దేవాదాయ సహాయ కమిషనర్ వి విజయరామారావు, ఇస్సన్నపల్లి, రామారెడ్డి సర్పంచ్‌లు దోకి లచ్చయ్య, రమేశ్, బండి ప్రవీణ్, నవీన్ పర్యవేక్షించారు. మహిళా సంఘ సేవా సమితి సభ్యులు భక్తులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాల వెంకట్‌రెడ్డి, ముల్క నాగరాజు, కేంద్ర కమిటీ సభ్యుడు కాసం శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా కట్కూరి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శిగా ఎం.రాఘవేంద్ర, అసోసియేట్ అధ్యక్షుడిగా జీవై ప్రభాకర్, కోశాధికారిగా ఎస్‌ఏ ముకీద్, ఉపాధ్యక్షులుగా ఎస్.శ్యాంసుందర్‌రెడ్డి, బి.పవిత్రన్, కే.లిఖిత్‌రెడ్డి, పి.శ్రీలత, సంయక్త కార్యదర్శులుగా జి.రాజాగౌడ్, కే.కృష్ణారెడ్డి, బి.శివచైతన్య, సౌజన్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కే.నవతేజ, ప్రచార కార్యదర్శిగా ఎన్.రవి, కార్యవర్గ సభ్యులుగా తేజస్విని, రజని, రాజేశ్, సాయి ప్రసన్న, సలహాదారుగా జే.శ్రావణ్‌కుమార్ ఎన్నికయ్యారు.
హుండీ ఆదాయం లెక్కింపు


