పనులు సరే.. రక్షణ చర్యలేవీ?
● మాధవనగర్ వద్ద శరవేగంగా
జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణం
● ప్రయాణికుల రక్షణ కోసం కనీస చర్యలు చేపట్టని అధికారులు
నిజామాబాద్ రూరల్: మాధవ్‌నగర్ ఆర్వోబీ వద్ద పనులు శరవేగంగా నిర్వహిస్తున్నప్పటికీ, ప్రయాణికుల రక్షణ కోసం కనీస ఏర్పాట్లు చేయలేదు. దీంతో వాహనాల రాకపోకల సమయంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్వోబీ పనుల వద్ద తీసిన లోతైన గుంతలు, వాటి పక్కన ఎలాంటి ప్రమాద సూచికలు లేకపోవడంతో వాహనదారులు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆర్వోబీ ప్రాంతంలో విద్యుత్ లైట్లు సైతం ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో ఆ ప్రాంతంలో అందకారం అలుముకుంటుంది. దీంతో రాత్రివేళల్లో వాహనదారులు ఈ ప్రాంతంలో గుంతలు గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రమాదాలు జరగకుండా భారీకేడ్లను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
పనులు సరే.. రక్షణ చర్యలేవీ?


