యువత వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి
సుభాష్‌నగర్: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవితాన్ని నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ధన్‌పాల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానిగా ఉన్న సమయంలో దేశం కోసం అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. అణు పరీక్షల ఒప్పందం, తదితర ఇతర ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి ప్రపంచంలోనే భారత్‌కు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని, గతేడాది ఆయన 100వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినంగా ప్రకటించిందని పేర్కొన్నారు. వాజ్‌పేయి జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శనీయమని, ఆయన వ్యక్తిత్వాన్ని పుస్తకాల్లో చదివి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మల్లేశ్ యాదవ్, స్వామి యాదవ్, మాస్టర్ శంకర్, సాయిరాం, బంటు రాము, నారాయణ యాదవ్, పల్నాటి కార్తీక్, భూపతి తదితరులు పాల్గొన్నారు.


