అటల్‌జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
● జాతీయ పసుపు బోర్డు చైర్మన్
పల్లె గంగారెడ్డి
● ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి
ఆర్మూర్: దేశ సమగ్ర అభివృద్ధికి దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహర్ వాజ్‌పేయి అవలంభించిన విధానాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు బాలు, పోల్కం వేణు, జెస్సు అనిల్, సుంకరి రంగన్న, ఆకుల రాజు, బాయావత్ సాయి, తిరుపతి నాయక్, నర్సారెడ్డి, కుమార్, ప్రసన్న గౌడ్, బాసెట్టి రాజ్‌కుమార్, పులి యుగేందర్, శీను, విజయ్ ఆనంద్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీలో..
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి విద్యార్థులు, నాయకులు పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. నాయకులు అమృత్ చారి, పృథ్వి, సమీర్, మనోజ్, అక్షయ్, శివ, దుర్గదాస్, దిగంబర్, బంతిలాల్ పాల్గొన్నారు.
అటల్‌జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం


