ప్రజలకు సేవలు అందించి గుర్తింపు పొందాలి
భిక్కనూరు: ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు ప్రజలకు సేవలు అందించి గుర్తింపు పొందాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ హైదరాబాద్ వెళ్లి షబ్బీర్‌అలీ దంపతులను సత్కరించారు. తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి సర్పంచ్‌గా ప్రజలతో ఎన్నుకునేలా చేసినందుకు ఆమె షబ్బీర్‌అలీ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికి అందేలా చూడాలని సూచించారు. అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు షబ్బీర్‌అలీ సర్పంచ్ రేఖను అభినందించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, యువజన కాంగ్రెస్ నాయకుడు సాయికృష్ణలు ఉన్నారు.
షబ్బీర్ అలీతో డీసీసీ అధ్యక్షుడి భేటీ
నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని గురువారం హైదరాబాద్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మల్లికార్జున్ కాంగ్రెస్ ముఖ్యనేత షబ్బీర్ అలీ ఆశీర్వాదం తీసుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నికపై షబ్బీర్ అలీతో చర్చించినట్లు తెలిసింది.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
ప్రజలకు సేవలు అందించి గుర్తింపు పొందాలి


