యూరియా బుక్ చేసేదెలా?
● స్మార్ట్‌ఫోన్ లేని రైతుల్లో ఆందోళన
భిక్కనూరు: యూరియా పక్కదారి పట్టకుండా చూ సేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా ‘ఫెర్టిలైజర్ బు కింగ్ యాప్’ను రూపొందించింది. ఈ యాప్‌ద్వారా యాసంగి సీజన్‌లో యూరియా అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ విధానంపై స్మార్ట్‌ఫోన్ లేని రైతులు ఆందోళన చెందుతున్నారు. తామెలా యూరి యా తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది రైతులకు స్మార్ట్‌ఫోన్లు లేవు. వారు ఫీచర్ ఫోన్లనే వాడుతున్నారు. వృద్ధులు, నిరక్షరాస్యులు యాప్‌లు ఉపయోగించలేదు. యూరియా కావాలంటే తాము ఏం చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరుతున్నారు.


