క్రిస్మస్ వేడుకలకు చర్చీల ముస్తాబు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాలలో జరిగే క్రిస్మస్ వేడుకలకు చర్చిలను ముస్తాబు చేశారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చర్చీల వద్ద శామియాలు వేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నిరకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. వేడుకల అనంతరం అన్నదానం ఉంటుందని పాస్టర్లు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైనట్లు చర్చి ఫాదర్ తెలిపారు. గురువారం ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు.
క్రిస్మస్ వేడుకలకు చర్చీల ముస్తాబు


