నాడు భార్య.. నేడు భర్త సర్పంచ్
బాన్సువాడ రూరల్: కొత్తాబాది గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తుఫ్రాన్ సాయాగౌడ్ తన సమీప ప్రత్యర్థి దేవిసింగ్‌పై 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2018 నుంచి 2024 వరకు కొత్తాబాది సర్పంచ్‌గా ప్రస్తుతం సర్పంచ్‌గా ఎన్నికై న సాయాగౌడ్ సతీమణి అంకిత బీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. గ్రామ సర్పంచ్‌గా 5 ఏళ్ల పాటు సేవలందించారు. గతంలో తన భార్య అంకిత సర్పంచ్‌గా చేసిన అభివృద్ధి పనులే తన గెలుపునకు కారణమని, తాను కూడా అదే పంథాలో గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని నూతన సర్పంచ్ సాయాగౌడ్ అన్నారు. కాగా సతీమణికి పదవీ విరమణ సన్మానం, భర్తకు పదవీ బాధ్య తల స్వీకరణ ఒకే వేదికపై జరగడం విశేషం.
తుఫ్రాన్ సాయాగౌడ్, సర్పంచ్, కొత్తాబాది
అంకిత సాయాగౌడ్,
మాజీ సర్పంచ్ కొత్తాబాది
నాడు భార్య.. నేడు భర్త సర్పంచ్


