బైక్‌ను ఢీకొన్న బస్సు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో బుధవారం బస్సు ఢీకొని బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మెల్లకుంట తండాకు చెందిన మూడ్ బిచ్చు, తన భార్య మూడ్ మోతి బైక్‌పై బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మెదక్ బయల్దేరారు. అదే సమయంలో గోపాల్‌పేటలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద మెదక్ వైపు నుంచి ఎల్లారెడ్డి వెళ్తున్న బోధన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న బిచ్చు, అతని భార్య మోతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


