యూరియా కష్టాలు
● తెల్లవారుజామునుంచే క్యూలైన్..
● కొరత లేదన్న సొసైటీ అధికారులు
భిక్కనూరు : యాసంగి సీజన్ ప్రారంభంలోనే రైతు లకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. రైతులు సింగిల్ విండో కార్యాలయాలకు వచ్చి బారులు తీరుతున్నారు. కాచాపూర్ సింగిల్‌విండోకు యూరి యా బస్తాలు వచ్చాయన్న సమాచారంతో రైతులు బుధవారం వేకువ జామున ఐదు గంటల నుంచే బారులు తీరారు. క్యూలో చెప్పులను ఉంచి చలిలో వేచి ఉన్నారు.
ఒక్కో రైతుకు రెండు చొప్పున 444 యూరియా బస్తాలను అందించామని విండో సీఈవో మహేశ్వరి తెలిపారు. శుక్రవారం కూడా గ్రామంలో 444 బస్తాలను పంపిణీ చేశామన్నారు. యూరియా కొరత లేదని, కావాలని కొందరు చెప్పులను క్యూ లైన్‌లో పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
లింగంపేటలో..
లింగంపేట : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 900 బస్తాల యూరి యా నిల్వ ఉండడంతో బుధవారం పలు గ్రామా లకు చెందిన రైతులు యురియా కొనుగోలు చేయడానికి తరలివచ్చారు. పోతాయిపల్లిలో 300, భవానిపేటలో 300, అయిలాపూర్‌లో 300 బస్తాల యూరియా నిల్వలు ఉన్నాయని సీఈవో పెంటయ్య తెలిపారు. రైతులకు అవసరమైన యురి యా అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
యూరియా కష్టాలు


