పారదర్శకతకు డిజిటల్‌ న్యాయం అవసరం | - | Sakshi
Sakshi News home page

పారదర్శకతకు డిజిటల్‌ న్యాయం అవసరం

Dec 25 2025 8:25 AM | Updated on Dec 25 2025 8:25 AM

పారదర్శకతకు డిజిటల్‌ న్యాయం అవసరం

పారదర్శకతకు డిజిటల్‌ న్యాయం అవసరం

సుభాష్‌నగర్‌: కేసుల పరిష్కారం, అణగారిన వర్గాలకు సులభంగా న్యాయం అందేందుకు, పారదర్శకత, జవాబుదారీతనం కోసం డిజిటల్‌ న్యాయం అవసరమని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లోగల జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో బుధవారం జాతీ య వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ‘డిజిటల్‌ న్యాయ వ్యవస్థ ద్వా రా త్వరితగతిన, సమర్థంగా కేసుల పరిష్కారం’ అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. అనంత రం కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ జాతీయస్థాయిలో వినియోగదారుల హెల్ప్‌లైన్‌, జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1915 లేదా 1800 001915 ద్వారా ఫిర్యాదులు నమోదు చేస్తామని తెలిపారు. కేసుల సమర్థవంతమైన, వేగవంతమైన పరిష్కారాన్ని సాధించడానికి డిజిటల్‌ న్యాయం ఒక శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. తక్కు వ ఖర్చుతో న్యాయం అందుతుందని, పేపర్‌లెస్‌ వ్యవస్థ ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు. మార్కెట్‌లో ఏదైనా సేవలను వినియోగించుకునే సమయంలో వినియోగదారులు అ నుసరించాల్సిన విలువైన సూచనలను ఆయన చేశా రు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ జీఎం శ్రీకాంత్‌రె డ్డి, ఆహార భద్రత అధికారి నవిత, లీగల్‌ మెట్రా లజీ అధికారి సుజావత్‌ అలీ, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి శీరకాంత్‌, మాయావర్‌ రాజేశ్వర్‌, అనిల్‌కుమార్‌, ప్రవీ ణ్‌, వర్మ, మహాదేవుని శ్రీనివాస్‌, యాటకర్ల దేవేష్‌, గైని రత్నాకర్‌ పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement