అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
నిజామాబాద్ రూరల్: అన్నివర్గాల అభ్యున్నతికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 668 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలతో కలిసి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో ఆగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు త్వరగా ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెయూ(డిచ్‌పల్లి): నగరంలోని ఎల్లమ్మ గుట్టలో ఈనెల 28న నిర్వహించనున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, న్యాయవాది గొర్రె పాటి మాధవరావు ప్రథమ వర్ధంతి స్మారకోపన్యాస సభను విజయవంతం చేయాలని తెలంగాణ యూ నివర్సిటీ లా డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ జెట్లింగ్ యెల్లోసా అన్నారు. తెయూ క్యాంపస్‌లో బుధవారం స్మారక సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎల్లోసా మాట్లాడుతూ.. గొర్రెపాటి మాధవరావు సామాజిక కార్యకర్తగా, పేద ప్రజల కు అందుబాటులో ఉండి అనేక సేవలు అందించా రని తెలిపారు. ప్రథమ వర్ధంతి సభకు ముఖ్య వక్త గా నల్సార్ న్యాయ శాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ కృష్ణదేవరాజు వస్తున్నారని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్రవంతి, పీడీఎస్‌యూ ప్రతినిధులు జన్నారపు రాజేశ్వర్, కార్తీక్ పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి


