ప్రజలకు సమస్యలు రాకుండా చూడాలి
● బోధన్‌లో పారిశుధ్య పనులు
పకడ్బందీగా నిర్వహించాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
బోధన్‌టౌన్(బోధన్): పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో మంగళవారం నూతనంగా కొనుగోలు చేసిన 15 చెత్త సేకరణ ఆటోలకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప ట్టణంలో పారిశుధ్య పనుల్లో ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు ఇ చ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజ లు పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. బల్దియాకు నూతన భవ న నిర్మాణాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు, ప్రిన్సిపల్ కౌసర్ ఆయనకు విన్నవించారు. బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి, డయాలసీస్ రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కో అపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, మహిపాల్ రెడ్డి, తూము శరత్రెడ్డి, పాషా, నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, ప్రమోద్ చిన్న, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


