జంగంపల్లిలో వివాహిత ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరీ (30) ఐకేపీలో సీఏగా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గత కొన్ని రోజులుగా మెడ నొప్పితో బాధపడుతోంది. అలాగే ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో వీరికి కొద్దిగా అప్పులు అయ్యాయి. అట్టి విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతుండేదని కుటుంబీకులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
ధర్పల్లి: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఇలా.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మచ్చ రవి (45) గత కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్తున్నాడు. నెల రోజుల క్రితం సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందాడు. నెల రోజుల తర్వాత మంగళవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో ప్రజలు పాల్గొని రవికి కన్నీటి వీడ్కోలు పలికారు.
రవి మృతదేహం వస్తుందనడంతో కుటుంబీకులు ఇంట్లో రోధిస్తుండగా మృతుడి నడ్పి నాన్న మచ్చ రమేష్(60) హైబీపీకి గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
జంగంపల్లిలో వివాహిత ఆత్మహత్య


