నేడు పెన్షనర్స్‌ డే ముగింపు ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేడు పెన్షనర్స్‌ డే ముగింపు ఉత్సవాలు

Dec 17 2025 7:17 AM | Updated on Dec 17 2025 7:17 AM

నేడు పెన్షనర్స్‌ డే  ముగింపు ఉత్సవాలు

నేడు పెన్షనర్స్‌ డే ముగింపు ఉత్సవాలు

నేడు పెన్షనర్స్‌ డే ముగింపు ఉత్సవాలు జడ్జి సాయిసుధ బదిలీ గందరగోళానికి గురికావొద్దు

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని న్యూ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో నేడు (బుధవారం) సాయంత్రం అఖిల భారతీయ పెన్షనర్స్‌ డే ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పండరినాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలకు జిల్లాలోని రిటైర్ట్‌ ఎంప్లాయీస్‌ అందరూ కుటుంబసమేతంగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ కుమార్‌గౌడ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణరెడ్డితోపాటు ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు.

కొనసాగుతున్న క్రీడాపోటీలు

నగరంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో రిటైర్డ్‌ ఉద్యోగుల క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. క్యారమ్‌, పరుగుపందెం, టేబుల్‌ టెన్నీస్‌, షటిల్‌, మ్యూజిక్‌ చైర్‌, స్కిల్‌ గేం, చెస్‌, పాటల పోటీలు వంటి అంశాల్లో రిటైర్డ్‌ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి ప్రేమ్‌లాల్‌

నిజామాబాద్‌ రూరల్‌: తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షు డు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించే ప్ర పంచ తెలుగు కవుల సమ్మేళనానికి జిల్లాకు చెందిన కవి,రచయిత ప్రేమ్‌లాల్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయనకు సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

నిజామాబాద్‌ లీగల్‌: నిజామాబాద్‌ అదనపు సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి సాయిసుధను నిజామాబాద్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా బదిలీ చేస్తు తెలంగాణ హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సాయిసుధ ఈ పదవిలో ఇన్‌చార్జిగా సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా కొనసాగుతుండగా, ప్రస్తుతం ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉంటు అదనపు సీనియర్‌ సివిల్‌ కోర్టు ఇన్‌చార్‌జ్జ్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సాయిసుధ నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవ సంస్థ ఇన్‌చార్జిగా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది.

బాన్సువాడ రూరల్‌: పంచాయతీ ఎన్నికల నే పథ్యంలో మంగళవారం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వా న్‌ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి తీసుకెళ్లాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు సరిచూసుకోవాలని ఆర్‌వోలకు సూచించారు. తప్పనిసరిగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement