క్రైం కార్నర్
కరెంట్ షాక్‌తో మహిళ మృతి
వేల్పూర్: వేల్పూర్ మండలం లక్కోర గ్రామ సమీపంలో కరెంటు షాక్‌తో ఓ మహిళ మృతిచెందింది. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. భీమ్‌గల్ మండలం సంతోష్‌నగర్‌కు చెందిన పాల్థియప్పి అంబి(58) అనే మహిళ లక్కోర పెట్రోలు పంపు వద్ద కూలీపని చేసుకుంటూ జీవించేది. ఈక్రమంలో మంగళవారం పనిలో భాగంగా చెత్తను పెట్రోలు పంపు వెనుక భాగంలో పారవేయడానికి వెళ్లింది. సమీపంలో కరెంటు వైర్లు తెగిపడి ఉండటంతో ఆమెకు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కామారెడ్డిలో వృద్ధురాలు ..
కామారెడ్డి క్రైం: పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గేటు వద్ద ఓ వృద్ధురాలు మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి గేటు వద్ద మంగళవారం ఓ వృద్ధురాలు పడి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆస్పత్రి వద్దకు చేరుకొని వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మొదట ఆమెను గుర్తుతెలియని వృద్ధురాలిగా భావించారు. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా ఆమె ఇందిరానగర్ కాలనీకి చెందిన గుంటి గంగవ్వ (65)గా గుర్తించారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నస్రుల్లాబాద్: మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు ఇలా.. కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన మన్నె నాగరాజు మంగళవారం నస్రుల్లాబాద్ నుంచి స్వగ్రామానికి సైకిల్‌పై బయలుదేరాడు. గ్రామ శివారులో డీసీఎం వాహనం ఎదురుగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా, సదరు వాహన డ్రైవర్ తనను పక్కకు పడేసి పారిపోయాడని బాధితుడు పేర్కొన్నాడు. స్థానికులు బాధితుడిని గుర్తించి చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు.
క్రైం కార్నర్


