వైభవంగా దేవునిపల్లి మల్లన్న జాతర
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి మల్లన్న స్వామి ఉత్సవాల్లో(సట్టి తీర్థం) భాగంగా మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉదయం బోనాలు, సాయంత్రం ఎడ్ల బండ్ల ఊరేగింపు, ఒడి బియ్యం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. డప్పు వ్యాయిద్యాలతో సాంప్రదాయంగా అలంకరించిన ఎడ్లబండ్ల ఊరేగింపునకు ఆయా గ్రామాల నుంచి కాకుండా వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవునిపల్లి నవచైతన్య క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధిపేట శ్యామ్ కల్చరల్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, వీడీసీ అధ్యక్షుడు గూడెల్లి గంగారాం, ప్రధాన కార్యదర్శి ద్యావరి నరేష్, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా సుదర్శన నారసింహ హోమం
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న–సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 16 జంటలు ఈ హోమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్‌రెడ్డి, ఈవో ప్రభురాంచంద్రం, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, నర్సింహాచార్యులు, పరంధామాచార్యులు, సంజీవాచార్యులు పాల్గొన్నారు.
వేంకటేశ్వర, గోదాదేవిలకు ప్రత్యేక పూజలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వేంకటేశ్వరస్వామి, గోదాదేవీలకు ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహేందర్ పంతులు, సదాశివుడు, సద్ది రాంరెడ్డి, పరమేశ్వర్, రవికుమార్ పాల్గొన్నారు.
వైభవంగా దేవునిపల్లి మల్లన్న జాతర
వైభవంగా దేవునిపల్లి మల్లన్న జాతర
వైభవంగా దేవునిపల్లి మల్లన్న జాతర
వైభవంగా దేవునిపల్లి మల్లన్న జాతర


