నందిపేటకు చేరుకున్న గోదావరి పరిక్రమ
● సాధుసంతులకు ఘన సన్మానం
● భక్తిశ్రద్ధలతో కన్యాపూజలు
నందిపేట్(ఆర్మూర్): ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలూక్ పీఠాధిపతి రాజేంద్రనాథ్ దాస్‌జీ 500 మంది సాధుసంతులతో కలిసి చేపట్టిన పవిత్ర గోదావరి పరిక్రమ యాత్ర నందిపేటకు చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, సాధుసంతులు కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన కన్యాపూజలో పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాధిపతి కేదారానంద స్వామి రాజేంద్రనాథ్ దాస్‌జీకి పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్‌దాస్ జీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. పరిక్రమ యాత్ర అంటే ఒక పవ్రితమైన ప్రదేశం (నది, పర్వతం, ఆలయం) చుట్టూ ప్రదక్షిణ చేసే ఆధ్యాత్మిక యాత్ర అని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో రక్షణ, హిందూధర్మ ప్రచారం యాత్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన పరిక్రమ యాత్ర తిరిగి నాసిక్‌కు చేరుకుంటుందని, యజ్ఞంతో యాత్రను సంపూర్ణం చేస్తామన్నారు. కేదారేశ్వర ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
నందిపేటకు చేరుకున్న గోదావరి పరిక్రమ


