మూడో విడతకు సర్వం సిద్ధం
సాక్షి నెట్‌వర్క్: మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు. జిల్లాలో మూడో విడతలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మంగళవారం బాన్సువాడ మండలానికి సంబంధించి ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బీర్కూర్‌లో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం, నస్రుల్లాబాద్ మండలానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా సామగ్రి స్వీకరణ కేంద్రాల నుంచి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లారు. ఎన్నికల సిబ్బంది ఉదయం ఆరున్నర గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని మొదట మాక్‌పోల్ నిర్వహించిన అనంతరమే పోలింగ్ ప్రారంభించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడో విడతకు సర్వం సిద్ధం


