నాడు సతి.. నేడు పతి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని గున్కుల్ గ్రామాన్ని 2018లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 2019 లో ఎన్నికలు నిర్వహించగా బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన గంగి సునీత గెలిచి గ్రామ తొలి సర్పంచ్ అయ్యారు. ప్రస్తుత ఎన్నికలలో బీసీ జనరల్ రావడంతో ఆమె భర్త రమేశ్ యాదవ్ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి గెలిచారు.
భిక్కనూరు: భిక్కనూరు రైల్వేస్టేషన్ గ్రామం భిక్కనూరు గ్రామపంచాయతీ పరిధిలో కొంత భాగం, బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మరికొంత భాగం ఉండేది. పంచాయతీల పునర్విభజనలో ఈ గ్రామాన్ని పంచాయతీగా చేశారు. ఊరి పేరును శ్రీసిద్దరామేశ్వరనగర్‌గా మార్చారు. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శ్రీసిద్దరామేశ్వరనగర్ బీసీ జనరల్ అయ్యింది. బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన జనగామ శ్రీనివాస్ సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు కేటాయించడంతో ఆయన భార్య రాణి బరిలో నిలిచి గెలిచారు.
ఎల్లారెడ్డి: మండలంలోని సోమార్‌పేట్ గ్రామంలో ట్రాక్టర్ దాడిలో గాయపడిన వారిని మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో ఐదుగురు గాయాలపాలయ్యారని, దాడి చేసిన వారితోపాటు కారకులను సైతం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
● బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
ఎల్లారెడ్డిరూరల్: సోమార్‌పేట్ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బిట్ల భారతి, బాలమణిలను ఎమ్మెల్యే మంగళవారం హైదరాబాద్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనకు సంబంధించి ఎస్పీ, డీఎస్పీలతో మాట్లాడి సంపూర్ణ విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.
నాడు సతి.. నేడు పతి
నాడు సతి.. నేడు పతి
నాడు సతి.. నేడు పతి
నాడు సతి.. నేడు పతి


