‘పాలకవర్గంపై కక్షతోనే ఫిర్యాదులు’
గాంధారి: ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గంపై కొందరు కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని సోమ్లానాయక్ తండావాసులు పేర్కొన్నారు. ఈ విషయమై సోమవారం తహాసల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్‌లను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమ్లానాయక్ తండా సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఈనెల 7న పంచాయతీ రిటర్నింగ్ అధికారి ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందించారన్నారు. అయితే పంచాయతీ పరిధిలోని పంతులు నాయక్ తండాకు చెందిన కొందరు వ్యక్తిగత కక్షతో నూతన పాలకవర్గాన్ని రద్దు చేయాలని లేదా తమ తండా అభివృద్ధికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో, తహసీల్దార్‌లను కోరారు.


