సంఘటన స్థలం పరిశీలన
దోమకొండ: అంబారిపేట శివారులో పెద్దపులి దాడిలో చనిపోయిన దూడల కళేబరాలను సోమవారం మండల పశువైద్యాధికారి శివకుమార్, సిబ్బంది పరిశీలించారు. సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ పారూఖ్, బీట్ ఆఫీసర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
పాదముద్రల పరిశీలన
బీబీపేట: మాందాపూర్ శివారులో పులి సంచరిస్తోందని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సోమవారం అటవీ శాఖ సిబ్బంది వచ్చి పాదముద్రలను సేకరించారు. ఎడ్ల కట్ట వాగు శివారులో పులి సంచరించినట్లు గుర్తించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో రాత్రి సమయంలో ఎవరూ అటవీ ప్రాంతాలకు వెళ్లరాదని చాటింపు వేయించారు.
అంబారిపేట శివారులో పంచనామా
నిర్వహిస్తున్న పశువైద్యాధికారి శివకుమార్


