పోలీసుల విస్తృత తనిఖీలు
నందిపేట్(ఆర్మూర్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నందిపేట మండలంలో సోమవారం పోలీసులు, ఎన్నికల అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉమ్మెడ బ్రిడ్జి సమీపంలో అయిలాపూర్, కంఠం, నందిపేట, వెల్మల్ గ్రామాల సమీపంలోని ప్రధాన రోడ్ల వెంట అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్యాంరాజ్ మాట్లాడుతూ వాహనాల్లో మద్యం బాటిళ్లు, రూ. 50 వేలకు మించి నగదు తరలించరాదని హెచ్చరించారు.
ఆర్మూర్‌లో..
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో సోమవారం రాత్రి ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాతబస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులు, హోటళ్లు, పాన్‌షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ ద్వారా పరిశీలించారు.


