డ్రా పద్ధతిలో వార్డు సభ్యుడి ఎన్నిక
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డుకు ఆదివారం జరిగిన ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు రావడంతో వారిలో ఒకరిని అధికారులు డ్రా పద్ధతిలో ఎన్నుకున్నారు. 4వ వార్డు స్థానానికి గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్, మంగలి మహేశ్ నామినేషన్లు వేశారు. వీరికి 61 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో ఇరువురి పేర్లను చీటీలలో రాసి డ్రా తీయగా అందులో చాకలి శ్రీకాంత్ పేరు రావడంతో ఆయనను వార్డు సభ్యుడిగా ఎన్నుకున్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజీపేట గ్రామానికి చెందిన సోను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికై నట్లు తండావాసులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలు తమిళనాడులోని చైన్నెలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సోను హైదరాబాదులోని జేఎన్‌టీయూహెచ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. జిల్లాలోని మారుమూల తండా నుంచి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడంతో తండావాసులు సోనును అభినందించారు.
బాన్సువాడ: బీర్కూర్ మండలం నుంచి నస్రుల్లాబాద్ వైపునకు వెళ్తున్న కారులో రూ.6.70 లక్షలను ఎస్‌ఎస్‌టీ బృందం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. బృందం సభ్యులు జ్యోతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నగదును తీసుకెళ్లకూడదన్నారు.
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని మద్యం, కల్లు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. మూడో విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఎకై ్స జ్ అధికారులు ఆదేశించారు. అందులో భాగంగా నస్రుల్లాబాద్, దుర్కి వైన్సులను, ఆయా గ్రామాల్లో ఉన్న కల్లు దుకాణాలకు ఎకై ్సజ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, సందీప్‌లు సీలు వేశారు.
వేల్పూర్: వేల్పూర్ మండలం వెంకటాపూర్, కోమన్‌పల్లి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సరియైన సౌకర్యాలు ఉన్నవి లేనివి చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని మండలస్థాయి అధికారులకు సూచించారు. ఓటర్లకు తాగునీరు, నీడకోసం టెంట్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో బాలకిషన్, ఆర్.ఐ. గోపాల్,జీపీల కార్యదర్శులు ఉన్నారు.
నిజామాబాద్ అర్బన్: ఓ తల్లి రెండు నెలల కు మారుడిని విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీనివాస్ ఈ నెల 5న తన భార్య, కుమారుడు కని పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ నెల 10న సదరు మహిళ తిరిగి ఇంటికి వచ్చింది. అయితే తల్లితోపాటు కుమారుడు లేకపోవడంతో శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తల్లే కుమారుడిని మహారాష్ట్ర పుణెలోని విశాల్ అనే వ్యక్తికి రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు తేల్చారు. బాలుడి విక్రయంలో ఎల్లమ్మగుట్టకు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారు. పోలీసులు బాలుడి తల్లిని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని తండ్రికి అప్పగించారు.
డ్రా పద్ధతిలో వార్డు సభ్యుడి ఎన్నిక


