హాకీ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బాలబాలికల అండర్–17 హాకీ ఎంపికలు సోమవారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేశారు. వీరు రాష్ట్రస్థాయి అండర్–17 హాకీ క్రీడల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కే హీరాలాల్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి ఆర్ వెంకటేశ్వరగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు నోముల మధుసూదన్‌రెడ్డి, ఆంజనేయులు, స్వామి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
హాకీ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక


