చల్లటి చలికి వెచ్చటి గొంగళి
రామారెడ్డి: జిల్లాలో చలి చంపేస్తోంది. వెచ్చదనం కోసం జనాలు పడరాని పాట్లు పడుతున్నారు. చలి మంటలు వేసుకుంటున్నారు. అయినా రాత్రిపూట ఈ వారం రోజులుగా తీవ్రమైన చలి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. వెచ్చదనం కోసం స్వెట్టర్లు, మఫ్లర్లు, అన్నీ కప్పుకున్నా చలి నుంచి తట్టుకోకపోవడంతో గ్రామాలలో పల్లెల్లో చేతితో తయారుచేసిన గొంగడిని ఖరీదు చేసి చలి బారి నుంచి కొంతమేర ఉపశమనం పొందుతున్నారు. ఒక్కో గొంగడికి రూ.15 వందల నుంచి 2 వేల వరకు డిమాండ్ పలుకుతోంది. అయితే ఈ గొంగళ్లు మూడు నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతిరోజూ వాడినా నాణ్యత బాగా ఉంటోందని, అందుకే అంత డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. గొంగడిని ఎక్కువగా కురుమ, యాదవ కులస్తులే వాడేవారు. కానీ ప్రస్తుతం చలికి తట్టుకోలేక అందరూ గొంగడిని కొని రాత్రి వేళలో కప్పుకుంటున్నారు.
● పల్లెల్లో గొంగడికి పెరిగిన డిమాండ్
● చేతితో తయారు చేసిన గొంగళికి రూ.1500 నుంచి 2000 వరకు డిమాండ్
గొంగళ్లు అమ్ముతున్న మహిళ
గొంగడి కప్పుకున్న వృద్ధుడు
చల్లటి చలికి వెచ్చటి గొంగళి


