రెండో విడతలోనూ పోటెత్తారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఏడు మండలాల్లోని 153 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులతో పాటు 873 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే చాలాచోట్ల ఓటర్లు బారులు తీరారు. పెద్ద గ్రామాల్లో భారీ లైన్లు కనిపించాయి. పోలింగ్ సమయం ముగిసే సమయంలో వరుసలో నిల్చున్న వారందరి ఓటేసే అవకాశం కల్పించారు. రెండో విడతలో 86.08 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. లింగంపేట మండలంలో పోలింగ్ ఉదయం మందకొడిగా సాగినా చివరికి 83.64 శాతం ఓట్లేశారు. ఎల్లారెడ్డి మండలంలో అత్యధికంగా 89.72 శాతం పోలింగ్ నమోదు కాగా.. నిజాంసాగర్‌లో 88.73 శాతం, నాగిరెడ్డిపేటలో 88.69 శాతం, మహ్మద్‌నగర్‌లో 86.68 శాతం, గాంధారిలో 85.22 శాతం, పిట్లంలో 84.12 శాతం పోలింగ్ రికార్డయ్యింది.
పోలింగ్ కేంద్రాల సందర్శన
రెండో విడత ఎన్నికలు జరిగిన గ్రామాలలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవోలు, డీఎస్పీలు సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
153 సర్పంచ్, 873 వార్డులకు పోలింగ్
ఓటింగ్ శాతం 86.08 గా నమోదు
ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ
ఎన్నికల సరళిని పరిశీలించిన
కలెక్టర్, ఎస్పీ
రెండో విడతలోనూ పోటెత్తారు
రెండో విడతలోనూ పోటెత్తారు
రెండో విడతలోనూ పోటెత్తారు


