అభివృద్ధిలో భాగమవుతా
● పంచాయతీలకు ఫర్నిచర్ అందిస్తా
● ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్‌రెడ్డి
బీబీపేట: పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయడంలో భాగస్వామినవుతానని ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ గ్రామంలోని ఆయన నివాసంలో నూతనంగా ఎన్నికై న పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి అవసరమైన ఫర్నిచర్ అందిస్తానని పేర్కొన్నారు. ఫర్నిచర్ కోసం చిన్న పంచాయతీకి లక్ష రూపాయల వరకు, పెద్ద పంచాయతీలకు రూ. 2 లక్షల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. నూతన పాలకవర్గాలు అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.


