ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
కామారెడ్డి టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 2,884 మంది దరఖాస్తు చేసుకోగా వారికోసం జిల్లావ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2210 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 674 విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈవో రాజు పర్యవేక్షించారు.
పెద్దకొడప్‌గల్: బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన పెద్దకొడప్‌గల్‌లో విలేకరులతో మాట్లాడారు. నాలుగుసార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా గెలిచానని, మూడేళ్లపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశానని పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి లేదా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇస్తానన్నా తీసుకోలేదన్నారు. ఆ పార్టీ నిర్వహించిన ఏ సమావేశానికీ హాజరుకాలేదన్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించలేక, బీజేపీకి న్యాయం చేయలేక ఇబ్బందిపడుతున్నానని, ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాజీనామా లేఖను బీజేపీ, జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు పంపుతానని పేర్కొన్నారు.
దోమకొండ : జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదవుతుండడంతో జనం గజగజ వణుకుతున్నారు. గతేడాది జనవరిలో తీవ్ర ప్రతాపం చూపిన చలి ప్రస్తుతం డిసెంబరులోనే తీవ్రంగా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 5 గంటలనుంచే చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తోంది. చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉదయం పనులకు వెళ్లేవారు, నైట్ డ్యూటీలు చేసేవారు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
బాన్సువాడ : తెలంగాణ జూనియర్స్ వాలీబాల్ జట్టు కెప్టెన్‌గా జిల్లాకు చెందిన విస్లావత్ నరేందర్ ఎంపికయ్యాడు. నస్రుల్లాబాద్ మండలం రాములగుట్ట తండాకు చెందిన నరేందర్ నెమ్లి పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కామారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో నరేందర్ ప్రతిభ చూపడంతో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈనెల 16 నుంచి 21 వరకు రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టుకు నరేందర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నరేందర్‌ను వీఎఫ్‌ఐ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ హన్మంత్‌రెడ్డి, కోచ్ సురేందర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలు, రవీందర్‌రెడ్డి అభినందించారు.
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష


