ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
దోమకొండ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని అంచనూరు గ్రామానికి చెందిన యువకుడు భాస్కరి నందు (23) శుక్రవారం రాత్రి ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నా యి. హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ జీవిస్తు న్న భాస్కర్ గురువారం గ్రామంలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అతడు మనోవేదన కు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. మృతుడి తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యం కారణంతో..
భిక్కనూరు: అనారోగ్య సమస్యల కారణంగా ఇసన్నపల్లి గ్రామానికి చెందిన మందస్వామి(52) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనే యులు తెలిపారు.కొంతకాలంగా ఫిట్స్‌తో బాధపడుతున్న మందస్వామి జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి అతడిని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భిక్కనూరు: మండలంలోని కా చాపూర్ గ్రామానికి చెందిన మె ట్టు నరేశ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయు లు శనివారం తెలిపారు.20 రో జుల క్రితం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన నరేశ్ తిరి గి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారని తెలిపారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేశారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య


