హసన్‌పల్లిలో ఉత్కంఠగా ప్రత్యర్థుల పోరు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ పంచాయతీలో ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోరు ఉత్కంఠబరితంగా సాగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు మళ్లి ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన మోత్కుల సంగమేశ్వర్ గౌడ్, బోయిని హరీన్ సర్పంచ్ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో మోత్కుల సంగమేశ్వర్ గౌడ్ 27 ఓట్లతో బోయిని హరీన్‌పై విజయం సాధించారు. గ్రామంలో 997 మంది ఓటర్లు ఉండగా పురుషులు 436 మంది, సీ్త్రలు 561 మంది ఉన్నారు. ఈసారి ఓటర్లు మాత్రం ఎవ్వరికి పట్టం కడుతారో తేలాల్సి ఉంది.
హసన్‌పల్లిలో ఉత్కంఠగా ప్రత్యర్థుల పోరు


