ఆ పల్లెల్లో తొలిపొరు ..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కన్నారెడ్డి, చిన్నఆత్మకూర్ గ్రామపంచాయతీలలో ఆదివారం తొలిపొరు జరుగనుంది. యేడాది క్రితం మండలంలోని ధర్మారెడ్డి గ్రామపంచాయతీ నుంచి కన్నారెడ్డి, ఆత్మకూర్ గ్రామపంచాయతీ నుంచి చిన్నఆత్మకూర్ వేరు పడి నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో ఆ పల్లెలకు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు తొలిపోరుగా మారాయి. కాగా కన్నారెడ్డి పంచాయతీ పరిధిలో 6 వార్డు స్థానాలుండగా 134మంది పురుషులు, 171మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చిన్నఆత్మకూర్ పంచాయతీ పరిధిలో 8 వార్డు స్థానాలుండగా 289మంది పురుషులు, 331మది మహిళలు ఓటర్లుగా నమోదై ఉన్నారు. సర్పంచ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
మహమ్మద్ నగర్ మండలంలో..
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రంగా ఏర్పాటైన తర్వాత గ్రామంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా అందోల్ అశ్విని ఎన్నికల బరిలో నిలువగా, బీఆర్‌ఎస్ మద్దతుదారుగా దఫేదార్ బాలమణి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సదరు గ్రామ పంచాయతీలో 1,777 మంది ఓటర్లు ఉండగా పురుషులు 838 మంది, సీ్త్రలు 939 మంది ఉన్నారు. అందోల్ అశ్విని తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దఫేదార్ బాలమణి ఇప్పటికే రెండు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికవడంతో పాటు కుమారుడు రాజు ఒక్కసారి సర్పంచ్ కాగా, ఆమె భర్త దఫేదార్ కిషన్ సైతం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దఫేదార్ బాలమణి మూడోసారి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామ ప్రజల తీర్పుతో వీరిలో ఎవరు విజయం సాధిస్తారో ఆదివారం తేలనుంది.
ఆ పల్లెల్లో తొలిపొరు ..


