తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదని దాడి
● రెంజల్ మండలం వీరన్న గుట్టలో ఘటన
● నలుగురి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
● వివరాలు వెల్లడించిన
బోధన్ ఏసీపీ శ్రీనివాస్
బోధన్‌రూరల్: తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదనే కక్షతో రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో పలువురిపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. బోధన్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. వీరన్నగుట్ట గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన రిజ్వానా బేగంకు మద్దతు ఇవ్వలేదని, అనుకూలంగా ఓట్లు వేయలేదని ఆమె కొడుకులు ఇబ్రహీం, అబు బాకర్ తమ అనుచరులు సిరాజ్, వాజీద్, ఇలియాస్, అవేజ్, ఆరిఫ్, మోయిన్ ఖాన్ తదితరులతో కలిసి జమీలుద్దీన్, అఫ్సర్, హైమద్‌పై మరణాయుధాలతో ఈ నెల 12వ తేదీన నూర్ మసీద్ వద్ద ప్రార్థనల అనంతరం దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశా మని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి దాడి కి ఉపయోగించిన ఎంహెచ్ 46 ఏఎల్ 6852 నంబర్ కారుతోపాటు రెండు కత్తులు, ఐరన్ రాడ్డులు, కర్రలు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొంత పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. సమావేశంలో బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


