‘పనిచేసేవారినే ఎన్నుకోవాలి’
బాన్సువాడ రూరల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే సత్తా ఉన్న యోగ్యులనే సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన తాడ్కోల్, బుడిమి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం లాంటిదని దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు అందె రమేష్, ఖమ్రోద్దీన్, మధుసూదన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, గంగుల గంగారాం, వెంకట్‌రెడ్డి, రాజు, లక్ష్మాగౌడ్, గౌస్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.


