చిన్నమల్లారెడ్డిలో ఒకరి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలంలో ని చిన్నమల్లారెడ్డిలో ఓ వ్యక్తి ఆత్మహత్య కు యత్నించగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలు ఇలా.. రామాయంపేటకు చెందిన ఇబ్రహీం(35)కు బా న్సువాడకు చెందిన ఓ మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు రావడంతో కొంతకాలంగా భార్య పిల్లలను తీసుకొని తల్లిగారింట్లో ఉంటోంది. దీంతో ఇబ్రహీం కొంతకాలంగా తన అ మ్మమ్మ గ్రామమైన చిన్న మల్లారెడ్డిలో ఉంటూ ప్రైవేటుగా మెకానిక్ పను లు చేస్తున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని కొద్దిరోజులుగా అతడు మనస్థాపానికి గురవుతున్నాడు. శుక్రవారం ఉదయం అతడు జీవితంపై విరక్తి చెంది చిన్నమల్లారెడ్డిలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గుర్తించి, అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


