కుంటలో పడి ఒకరు మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేటలోని సూర్ణకుంటలో ఓ వ్యక్తి పడి మృతిచెందినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన తిదిరి నవీన్(40) మూడు రోజుల క్రితం తన భార్య వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు నవీన్ భార్యకు పోన్ చేసి విచారించగా తన వద్దకు రాలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని సూర్ణకుంటలో నవీన్ మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి, మృతుగి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. సూర్ణకుంటలో మృతుడు కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తండ్రి లక్ష్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


