ప్రతిపక్షాల అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుం
పెద్దకొడప్‌గల్(జుక్కల్):ప్రతిపక్షాల అభ్యర్థిని గెలిపి స్తే అభివృద్ధి కుంటుపడుతుందని,ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మాదిరిగా ఉంటుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రంతో పాటు బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, బూరుగుపల్లి, సముందర్ తండా, జగన్నాథ్‌పల్లి, చిన్న తక్కడ్‌పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే తోట ల క్ష్మీకాంతారావు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్ర భుత్వంలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే నియోజకవర్గా న్ని ఏ రకంగా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తానని, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


