మూడు సార్లు ఒకే ఓటుతో గెలుపు
● ఈసారి కూడా ఒక ఓటు తేడాతో
ఒకటవ వార్డులో విజయం
● రామారెడ్డిలో అరుదైన ఘటన
రామారెడ్డి: స్థానిక సంస్థల్లో ప్రతి ఓటుకు ఎంతో వి లువ ఉంటుంది. అలాంటిది మండల కేంద్రం రా మారెడ్డిలో 1వ వార్డులో మూడు పర్యాయాలుగా ఓ కే ఓటు తేడాతో వార్డు సభ్యులు గెలవడం ఆనావాయితీగా వస్తుంది. 2006 నుంచి గొల్ల రాజు.. చాతరబోయిన శంకర్‌పై ఒక ఓటు తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డులో తుపాకుల స్వామి గౌడ్, ..అమ్ముల శృతిపై ఒక ఓటు తేడా తో గెలుపొందాడు. మళ్లీ 2025 డిసెంబర్ 11 జరిగిన ఎన్నికల్లో జరిగారిరాజేందర్, జీర్‌గారి రాజయ్యపై ఒక ఓటు తేడాతో గెలుపొందాడు. జీర్‌గారి రాజేందర్‌కు 103 ఓట్లు రాగా జీర్‌గారి రాజయ్యకు 102 ఓట్లు వచ్చాయి. 2019లో ఒక్కసారి తప్ప ప్రతిసారి ఒక టో వార్డులో ఒకే ఓటు తేడాతో గెలవడం విశేషం.


