18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా సరే..
కామారెడ్డి క్రైం: ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు ఒకటే ప్రధానం కాదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. 18 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం, పట్టదారు పాసుపుస్తకం, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన పోస్ట్ ఆఫీస్/బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వం జారీ చేసిన కార్డులలో దేనినైనా చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటరు స్లిప్‌ను ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.


