చైన్ స్నాచింగ్‌ల కలకలం
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల చైన్ స్నాచింగ్‌లు కలకలం రేపాయి. వినాయక్‌నగర్, కసాబ్‌గల్లీలో నంబర్ లేని పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే, ఈ రెండుచోట్ల చోరీకి పాల్పడిన వ్యక్తులు ఒక్కరే అని పోలీసులు గుర్తించారు. ఉదయం 7:30 గంటల సమయంలో వినాయకనగర్‌లోని నాయుడి స్వరూప ఇంటి ఎదుట అలుకు వేస్తోంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు వచ్చి స్వరూపను తెలిసిన వారి అడ్రస్సు చెప్పాలని మాట్లాడుతూ మెడలోని తులంన్నర బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయాడు. అనంతరం కసాబ్‌గల్లీలో ఇంటి ఎదుట ఉన్న లక్ష్మి అనే మహిళ మెడలోని రెండు తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. ఆమె కేకలు వేసి పక్కింటి వారిని పిలిచే సరికి నిందితులు బైక్‌పై పరారయ్యారు. నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్, రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితులు స్వరూప, లక్ష్మి ఫిర్యాదు మేరకు రెండు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
● నగరంలో రెండు చోట్ల ఘటనలు
● ఇద్దరే చేసినట్లు పోలీసుల నిర్ధారణ
చైన్ స్నాచింగ్‌ల కలకలం


