ప్రాణం తీసిన కంచె..
● విద్యుదాఘాతంతో రైతు మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నారుమడి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి రైతు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికలాన్‌లో బుధవారం చోటు చేసుకుంది. అల్లపురం లింగయ్య(59)అనే రైతు రోజూమాదిరిగానే ఉదయం గ్రామశివారులోని తన పొలంలో వరి నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లగా పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచెకు తగిలా డు. విద్యుత్ షాక్‌తో నారుమడి లో పడి ప్రాణాలు కోల్పోయా డు. మృతుడికి భార్య లస్మవ్వ, కొడుకు సురేశ్‌తోపాటు ముగ్గు రు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇంచార్జి ఎస్‌హెచ్‌వో మనోహర్ తెలిపారు.


