లారీ బోల్తా
ఇందల్వాయి: లారీ టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలుగడ్డల లోడ్‌తో హర్యానా నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ 44 నెంబర్ జాతీయ రహదారిపై ఇందల్వాయి బస్టాండ్ వద్దకు రాగానే టైరు పంచర్ అయ్యింది. సర్వీస్ రోడ్డుపై లారీ బోల్తా పడటంతో డీజిల్ ట్యాంకులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, క్లీనర్‌కి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. గన్నారం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. క్షతగాత్రులను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.


