పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలి
దోమకొండ/భిక్కనూరు: ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం రాష్ట్ర పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికలు తొలివిడతలో భాగంగా నేడు పది మండలాల్లో పోలీంగ్, కౌంటింగ్ జరుగనుంది. ఈక్రమంలో దోమకొండ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎన్నికల విధులకు హాజరైన అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రిసైడింగ్ అధికారులు మొత్తం పోలింగ్ ప్రక్రియను సమగ్రంగా పర్యవేక్షించి, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి అధికారి ఖచ్చితంగా పాటించాలన్నారు. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ ఉంటుందని, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగనుందని తెలిపారు. ఓటింగ్ విషయంలో గోప్యత పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలన్నారు. పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు వివరాల ప్రకటనలో అప్రమత్తంగా ఉంటూ పక్కాగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే ఓటింగ్ శాతాన్ని, కౌంటింగ్ వివరాలను వెల్లడించాలని సూచించారు. అలాగే భిక్కనూరులోనూ సత్యనారాణరెడ్డి పర్యటించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. దోమకొండ మండలంలో 9 గ్రామ పంచాయతీల పరిధిలో జరుగనున్న ఎన్నికలకు పూర్తిస్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీన్‌కుమార్, తహశీల్దార్ సుధాకర్, మండల అధికారులు పాల్గొన్నారు.
గ్రామాలకు తరలిన పోలింగ్ సిబ్బంది..
రామారెడ్డి/బీబీపేట/కామారెడ్డి రూరల్/సదాశివనగర్/మాచారెడ్డి/తాడ్వాయి: రామారెడ్డి మండల వ్యాప్తంగా 18 సర్పంచ్ స్థానాలకు, 166 వార్డు స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఎంపీడీవో నాగేశ్వరరావు తెలిపారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రితో బుధవారం సాయంత్రం వరకే ఆయా గ్రామాలకు చేరుకున్నారన్నారు. బీబీపేట మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు నేడు జరుగనున్న పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సదాశివనగర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా గురువారం 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నట్లు ఎంపీడీవో సంతోష్‌కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. తాడ్వాయి మండలంలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ, తహసీల్దార్ రహిమొద్దీన్ తెలిపారు. మండలంలో 18 గ్రామాలకు గాను 168 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాచారెడ్డి మండలంలో జీపీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు వేణుగోపాల్‌రావు, అశోక్ కుమార్ అన్నారు. అలాగే ఆయా మండల కేంద్రాల్లో బుధవారం పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేసి, వారికి కేటాయించిన గ్రామాలకు తరలించారు. కామారెడ్డి మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు నేడు పోలింగ్ జరుగనుండగా, ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామగ్రితో చేరుకున్నారు.
అధికారులు ఎన్నికల విధుల్లో అలసత్వం వహించొద్దు
రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు
సత్యనారాయణరెడ్డి
తొలివిడతకు అన్ని ఏర్పాట్లు పూర్తి
పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలి
పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలి
పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలి
పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలి
పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలి


