నారుమడిపై చలి ప్రభావం
● జాగ్రత్తలు పాటించాలంటున్న
వ్యవసాయ శాస్త్రవేత్తలు
రుద్రూర్: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలను రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్ రైతులకు వివరించారు. చలి తీవ్రత ఎ క్కువగా ఉంటే నారు సరిగ్గా ఎదగక, ఎర్రబడి కొ న్నిసార్లు చనిపోతుందని అన్నారు. యాసంగిలో వరి సాగు చేసే రైతులు నారుమడి యాజమాన్యంపై ప్ర త్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరి మొలకెత్తటానికి 25–45 డిగ్రీల సెల్సియస్, మొక్కల ఎదుగుదలకు 25–35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండడం మంచిదని, కానీ జిల్లాల్లో వారం రోజుల నుంచి 4–5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు అవుతోంది. దీంతో భూమిలోని పోషకాలు మొక్కకు అందక ఆకులు పసుపు రంగు మారి ఆ తర్వాత ఎండిపోతాయన్నారు. రాత్రి ఉష్ణోగ్రతల్లో వరినారు ఎదగదని, ఈ పరిస్థితుల్లో రైతులు చేస్తున్న పలు రకాల మందుల పిచికారీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నారు ఎర్రబడటం, తెగుళ్లు ఆశించడం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగితే మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని పేర్కొన్నారు.
నారుమడి రక్షణకు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది.
● చలికి నారు దెబ్బతినకుండా నారుమడికి సాయంత్రం నీటిని ఎక్కువగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్తనీరు పెట్టాలి.
● అధిక చలితో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి.
● వరి నారుమడికి పది గ్రాముల 19:19:19 పోష కాన్ని, 2.5గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజ బ్ మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్త సూచించారు.
నారుమడిపై చలి ప్రభావం


