కోనాపూర్‌ సర్పంచ్‌ బరిలో 10 మంది అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

కోనాపూర్‌ సర్పంచ్‌ బరిలో 10 మంది అభ్యర్థులు

Dec 11 2025 8:25 AM | Updated on Dec 11 2025 8:25 AM

కోనాప

కోనాపూర్‌ సర్పంచ్‌ బరిలో 10 మంది అభ్యర్థులు

కోనాపూర్‌ సర్పంచ్‌ బరిలో 10 మంది అభ్యర్థులు ముగిసిన డిగ్రీ పరీక్షలు పీజీ పరీక్షల ఫీజు చెల్లించాలి సంతమల్లన్నను దర్శించుకున్న సీపీ

కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ సర్పంచ్‌ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. మూడో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో సర్పంచ్‌ రిజర్వేషన్‌ జనరల్‌(అన్‌ రిజర్వుడ్‌)కు కేటాయించారు. గ్రామంలో 1,419 మంది ఓటర్లు ఉండగా, 10 వార్డులు ఉన్నా యి. ఇప్పటికే 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్‌ స్థానానికి పోటీచేస్తున్న వారిలో ఒకరు కాంగ్రెస్‌, మరొకరు బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఉన్నారు. మిగతా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సర్పంచ్‌ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఎన్నికలు ఆసక్తిగా మారాయి.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 11 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం జరిగిన 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 83 మంది విద్యార్థులకు 72 మంది విద్యార్థులు హాజరుకాగా 11 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షలు ముగిసేంత వరకు మొత్తం 20 మంది విద్యార్థులు డిబార్‌కు గురైనట్లు తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ 3వ సెమిస్టర్‌ (థియరీ, ప్రాక్టికల్‌), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు (ఏపీఈ, ఐపీసీహెచ్‌, ఐఎంబీఏ) 3వ, 9వ సెమిస్టర్‌ పరీక్షల ఫీజు ఈ నెల 24 వరకు చెల్లించాలని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ సంపత్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్‌, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు (ఏపీఈ) అన్ని సబ్జెక్టుల కలిపి పరీక్ష ఫీజు రూ.500, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ పీజీ ఐపీసీహెచ్‌ అన్ని సబ్జెక్టులు కలిపి పరీక్ష ఫీజు రూ.600, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.100 చెల్లించాలన్నారు. పీజీ (ఎంఏ, ఎమ్మెస్‌డబ్ల్యూ, ఎంకాం) అన్ని సబ్జెక్టులు కలిపి రూ.500, ఇంటిగ్రేటెడ్‌ పీజీ ఏపీఈ, ఐఎంబీఎ అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800 చెల్లించాలని తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

వేల్పూర్‌: అంక్సాపూర్‌ సంతమల్లన్నను సీపీ సాయిచైతన్య బుధవారం దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన సంతమల్లన్న జాతర బుధవారం వరకు జరిగింది. సంతమల్లన్నను దర్శించుకున్న సీపీ సాయిచైతన్యకు అంక్సాపూర్‌ వీడీసీ సభ్యులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. అనంతరం సీపీ దత్తాశ్రమంలోని పాదరసలింగం శివాలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ఆయన వెంట వేల్పూర్‌ ఎస్సై సంజీవ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

కోనాపూర్‌ సర్పంచ్‌  బరిలో 10 మంది అభ్యర్థులు 1
1/1

కోనాపూర్‌ సర్పంచ్‌ బరిలో 10 మంది అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement