మద్యం పట్టివేత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్‌పేటలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను ఫ్లయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్‌ఎస్‌టీ) అధికారులు బుధవారం పట్టుకున్నట్లు ఇంచార్జీ ఎస్‌హెచ్‌వో మనోహర్‌రావు తెలిపారు. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి గుర్జరి సాయిబాబా కారులో 96 బీరుబాటిళ్లను తరలిస్తుండగా ఎఫ్‌ఎస్‌టీ అధికారులు పట్టుకున్నారని తెలిపారు. పట్టుబడ్డ బీరుబాటిళ్ల విలువ రూ.12,480 ఉంటుందని వివరించారు. ఎఫ్‌ఎస్‌టీ ఇంచార్జీ ప్రదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
లింగంపేట మండలంలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి శివారులో అక్రమంగా తరలిస్తున్న మధ్యం బాటిళ్లను బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. అయ్యపల్లి గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు అడ్డగించి పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ. 18వేలు ఉంటుందన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను లింగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
భిక్కనూరు మండలంలో..
భిక్కనూరు: మండల కేంద్రంలో ఓటర్లకు డబ్బులు, మద్యం బాటిళ్లను పంచుతున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసినట్ల భిక్కనూరు ఎస్సై అంజనేయులు బుధవారం తెలిపారు. మండల కేంద్రంలోని సుభాష్‌గల్లిలో డబ్బులు పంచుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేయగా రూ.39వేల నగదు పట్టుబడిందన్నారు. అలాగే జండాగల్లి ప్రాంతంలో 55 మద్యం బాటిళ్లు, కుమ్మరిగల్లిలో 11 మద్యం బాటిళ్లను స్వా ధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
మద్యం పట్టివేత


