పోలీసులకు బాలిక అప్పగింత
మాక్లూర్: ఎవరూ తోడు లేక అటూ ఇటూ తిరుగుతూ బస్టాండ్‌లో నిద్రిస్తున్న బాలికను ఆలూర్ మండలం కల్లెడి గ్రామస్తులు గుర్తించి చేరదీశారు. మూడు రోజులుగా బాలిక సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో పోలీసులకు మంగళవారం అప్పగించగా వారు అనాథ బాలికల హోమ్‌కు తరలించారు. కల్లెడి గ్రామస్తుడు గంగోళ్ల ప్రళయ్‌తేజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల నుంచి ఐదేళ్ల బాలిక గ్రామంలో ఒంటరిగానే తిరుగుతూ రాత్రికాగానే బస్టాండ్‌లో నిద్రిస్తుందని తెలిపారు. తాము గమనించి భోజనం, కప్పుకోడానికి దుప్పటి అందించి మూడు రోజులుగా ఇంటి వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు. మంగళవారం నాటికి కూడా బాలిక సంబంధీకులు ఎవరూ రాకపోవటంతో పోలీసులకు అప్పగించగా వారు బాలికను అనాథ పిల్లల హోమ్‌కు తరలించినట్లు ప్రళయ్‌తేజ్ తెలిపారు. బాలిక వచ్చిరాని మాటలతో స్పష్టంగా మాట్లాడటం లేదన్నారు. ప్రళయ్‌తేజ్, గంగూలీ, నవీన్, గ్రామస్తులు ఉన్నారు.


