నాడు అత్త ఎంపీటీసీ.. నేడు కోడలు సర్పంచ్ బరిలో..
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డిలో బీమాయల నీలమ్మ నాడు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గ్రామ ఎంపీటీసీగా పోటీ చేసి ఐదేళ్ల పాటు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ సారి చిన్నమల్లారెడ్డి గ్రామానికి ఎస్సీ మహిళ రిజర్వు కావడంతో నీలమ్మ కోడలు బీమాయల లక్ష్మీని నిలబెట్టారు. ఈ సారి తన కోడలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా పోటీలో ఉన్నారని ఈ సారి కూడా ఎలాగైనా సర్పంచ్‌గా తన కోడలిని గెలిపించాలని సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. దీంతో నాడు అత్త, నేడు కోడలు పోటీలో ఉండడం గమనర్హం.


